కొత్త సీన్లతో విడుదలకు సిద్దమవుతున్న రజనీకాంత్ ‘బాబా’

  • డిసెంబర్ 12లోపు సినిమా తిరిగి విడుదల
  • కొత్త సీన్లకు డబ్బింగ్ చెప్పిన రజనీకాంత్
  • తుది ఎడిటింగ్ పనిలో ఉన్న దర్శకుడు సురేశ్ కృష్ణ
రజనీకాంత్ నటించిన బాబా సినిమా గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు మరోసారి రానుంది. ఈ విడత ఈ సినిమాలో కొన్ని కొత్త సీన్లు ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాయి. కొత్త సీన్లను జోడించి సినిమా విడుదల చేయాలని నిర్ణయించారు. కొత్త దృశ్యాలకు సంబంధించిన డబ్బింగ్ ను ఇప్పటికే రజనీకాంత్ చెప్పడం కూడా పూర్తయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాలకు చేరడంతో ఈ సినిమా పట్ల మరోసారి అభిమానుల్లో ఆసక్తి ఏర్పడుతోంది.

సినిమాను తనకు ఓ సారి ప్రత్యేకంగా చూపిస్తే.. తాను సైతం స్వరాలకు కొత్త అందాలను అద్దుతానని ఏఆర్ రెహమాన్ చెప్పినట్టు తెలిసింది. డిసెంబర్ 12న రజనీకాంత్ పుట్టిన రోజు. వీలైతే అదే రోజు, లేదంటే దానికంటే ముందే బాబా సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. దర్శకుడు సురేశ్ కృష్ణ కొత్తగా సీన్లను చేర్చిన అనంతరం ఎడిటింగ్ ను పర్యవేక్షించే పనిలో ఉన్నట్టు సమాచారం. బాబా సినిమాకు స్క్రీన్ ప్లే, స్టోరీ అందించింది రజనీకాంతే. ఈ సినిమాలో నటించడంతోపాటు, నిర్మాత పాత్రను కూడా ఆయనే పోషించారు.

Superstar
Rajinikanth
Baba movie
re release

More Telugu News